సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత
మంచిర్యాలఅగ్రికల్చర్: సాగు యోగ్యం కాని భూముల్లో సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ తెలిపారు. శనివారం పీఎం కుసు మ్ యోజన పథకం లబ్ధిదారులకు జిల్లా వి ద్యుత్ శాఖ ఎస్‌ఈ కార్యాలయంలో అవగాహ న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 58మంది ఔ త్సాహికులు రైతులతోపాటు పారిశ్రామికవేత్తలు సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చారని, రైతులకు తొలి ప్రాధాన్యత ఇ వ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపా రు. విద్యుత్‌ను డిస్కంలతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ప్లాంట్ల ఏర్పాటుకు ప్ర భుత్వం 50శాతం రాయితీ అందించాలని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వి ద్యుత్ శాఖ ఎస్‌ఈ గంగాధర్, లిడ్ బ్యాంక్ మే నేజర్ తిరుపతి, టీఎస్ రెడ్కో, బ్యాంకు అధికా రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment