మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్‌లో హైదరాబాద్ కేర్ ఆస్పత్రి సహకారంతో మంగళవారం ఉచిత వైద్య శిబి రం ఏర్పాటు చేశారు. కమాండెంట్ పి.వెంకటరాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. బెటాలియన్ అధికారులకు, సిబ్బందికి, కుటుంబ సభ్యులకు సాధారణ వైద్య పరీక్షలతోపాటు ఎముకలు, కీళ్లు, జీర్ణాశయ, మూత్రపిండాలు తదితన ప్రత్యేక వైద్య చికిత్సలను కేర్ ఆస్పత్రి వైద్యులు ప్రభాకర్, ఆదిత్య, రమీజ్‌పంజ్వాని పరీక్షలు చేశారు. బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్‌లు ఆర్.నాగేశ్వర్‌రావు, కాళిదాసు, యూనిట్ మెడికల్ అధికారి డాక్టర్ సంతోష్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.