
‘ఆస్తి పన్ను’లో లక్సెట్టిపేట ఫస్ట్..
నస్పూర్: 2024–25 ఆర్థిక సంవత్సరం ముగిసింది. పన్ను వసూళ్లలో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్‌లో సగటున 70.22 శాతం వసూలైంది. ఇందులో లక్సెట్టిపేట మున్సిపాలిటీ 86.31 శాతంతో మొదటిస్థానంలో నిలిచింది. బెల్లంపల్లి మున్సిపాలిటీ 56.25 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ నాలుగో స్థానంలో నిలిచింది.
మున్సిపాలిటీ అసెస్‌మెంట్ డిమాండ్ (కోట్లు ) వసూళ్లు (కోట్లు) శాతం
లక్సెట్టిపేట 5,988 1.68 1.45 86.31
మందమర్రి 13,680 2.29 1.76 76.86
క్యాతన్‌పల్లి 12,159 3.94 3.00 76.14
మంచిర్యాల(కార్పొరేషన్) 45,372 26.28 17.01 64.73
చెన్నూర్ 7,231 2.85 1.74 61.05
బెల్లంపల్లి 16,246 4.16 2.34 56.25
బెల్లంపల్లి లాస్ట్..