
గుణాత్మక విద్య అందించాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ● గిరిజన ఆశ్రమ పాఠశాల తనిఖీ
భీమారం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలని జిల్లా కలెక్టర్ కమార్ దీపక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాల, తాగునీటి సౌకర్యం, భోజనశాల, తరగతి గదులు పరిశీలించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధి దిశగా ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని, అన్ని పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, ప్రహరీ, అదనపు గదుల సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. నూతన మెనూ ప్రకా రం విద్యార్థులకు సకాలంలో పోషకాహారం అందించాలని, వంట సమయంలో తాజా కూరగాయలు వినియోగించాలని తెలిపారు. ప్రతీరోజు విద్యార్థులకు గంటసేపు ప్రత్యేక తరగతులు నిర్వహించి రా యడం, చదవడం నేర్పించాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపొందించాలని తెలిపారు.