
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులకు గాయాలు
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఏసీసీ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మందమర్రి మండలం బీజోన్‌కు చెందిన లగిషెట్టి తిరుపతి, స్వప్న దంపతులు, కూతురు ఆధ్య, కుమారుడు యశ్వంత్ సోమవారం బైక్‌పై బీజోన్ నుండి మంచిర్యాలకు బయలుదేరారు. ఏసీసీ సమీపంలో ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు బైక్ కిందపడడంతో ఆద్య కాలు విరగగా యశ్వంత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో చిన్నారులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ఈ విషయమై స్థానిక పోలీసులను వివరణ కోరగా ఘటనపై ఫిర్యాదు రాలేదన్నారు.