సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ రాజర్షిషా
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్న కలెక్టర్
మెదక్ కలెక్టరేట్: మెదక్ పట్టణానికి శనివారం రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్‌భూయన్‌తో పాటు హైకోర్టు జడ్జిలు నవీన్‌రావు, సంతోష్‌రెడ్డి తదితరులు వస్తున్నారని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు ప్రతిమా సింగ్, రమేష్‌లతో కలిసి అధికారులతో చీఫ్ జస్టిస్ రాకపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలోని కోర్టు సముదాయంలో రూ.5 కోట్లతో వ్యయంతో నిర్మించనున్న 3వ అంతస్తు భవన నిర్మాణానికి రాష్ట్ర హైకోర్టు చీఫ్ శంకుస్థాపన చేస్తారన్నారు.
వారికోసం ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్, ఫారెస్ట్ గెస్ట్‌హౌస్ అన్ని హంగులతో సిద్ధం చేయాలని ఆర్‌అండ్ బీ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. వారు సీఎస్‌ఐ చర్చి, ఏడుపాయల సందర్శిస్తారని, ఈసందర్భంగా లోటుపాట్లు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని, జనరేటర్ సిద్ధంగా ఉంచాలని విద్యుత్ అధికారికి సూచించారు.
ఏడుపాయలలో పూర్ణకుంభంతో స్వాగతం, దర్శనం, హరిత హోటల్‌లో విశ్రమించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని ఈఓ సాయి శ్రీనివాస్‌కు సూచించారు. సీజీ పర్యటించే ప్రాంతాలను శుభ్రం చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. ఈ సమాఏశంలో ఆర్డీఓలు సాయి రామ్, శ్రీనివాస్, ఆర్‌అండ్‌బీ డీఈ వెంకటేష్, డీఎంఅండ్‌హెచ్‌ఓ చందునాయక్, ఉద్యాన అధికారి నర్సయ్య, డీఎఫ్‌ఓ రవి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ సాగర్, ఏడుపాయల ఈఓ శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment