
మూగజీవాలకు భరోసా..
●సంచార వైద్య సేవలతో సత్ఫలితాలు ●‘1962’కు కాల్‌తో అత్యవసర వైద్యం
తూప్రాన్: మూగజీవాలకు సత్వర వైద్యం అందించేందుకు 2017లో అప్పటి ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. టోల్‌ఫ్రీ నంబర్ 1962కు ఒక్క ఫోన్ చేస్తే చాలు రైతులు కోరిన చోటుకు అంబులెన్స్‌లో సిబ్బంది వచ్చి పశువులకు చికిత్స అందిస్తున్నారు. ఫలితంగా జిల్లాలో పశువులు, జీవాల మరణాలు గణనీయంగా తగ్గాయి. జిల్లావ్యాప్తంగా రెండు పశుసంచార వాహనాల ద్వారా నెలకు సుమారు 1,800కు పైగా మూగజీవాలకు చికిత్స అందిస్తున్నారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ మారుమూల గ్రామాల్లో అత్యవసర వైద్యం కింద మూగజీవాలు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు వైద్యసేవలు అందుతున్నాయి. పశుసంచార వాహనంలో మూగజీవాలకు సంబంధించిన అన్ని రకాల మందులతో పాటు చికిత్సకు అవసరమయ్యే పరికరాలు అందుబాటులో ఉంటున్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న 2 సంచార వాహనాల్లో మొత్తం ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 10 వాహనాలతో పాటు 40 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.
పశువులకు అందించిన చికిత్స వివరాలు
సంవత్సరం పశువులు
2021 3,986
2022 3,794
2023 4,123
2024 3,964
2025 ఫిబ్రవరి వరకు 648
జిల్లాలో ఇలా..
పశువైద్య కేంద్రాలు: 67
ఉప కేంద్రాలు: 35
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు: 29 మంది
ఏరియా వెటర్నరీ ఆస్పత్రులు:
మెదక్, నర్సాపూర్, రామాయంపేట
సరైన వైద్య సేవలు
ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా ఉన్న రెండు పశు సంచార వాహనాల ద్వారా 35 వేల మూగజీవాలను కాపాడగలిగాం. ఎక్కడా ఎలాంటి సమస్య ఉన్నా తమకు ఫోన్‌్ వచ్చిన వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సరైన చికిత్స అందిస్తున్నాం. సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండటంతో పాటు వైద్య చికిత్సకు సంబంధించిన అన్ని పరికరాలు వాహనాల్లో అందుబాటులో ఉంచాం.
– అప్రోజ్, పశుసంచార వాహనాల
జిల్లా కో మేనేజర్
గేదెను కాపాడారు
నా గేదె అనారోగ్యంతో రెండు, మూడు రోజులుగా మేత మేయలేదు. దీంతో 1962 నంబర్‌కు ఫోన్ చేశా. గంట వ్యవధిలో సిబ్బంది ఇంటి వద్దకు వచ్చి గేదెకు చికిత్స అందించారు. మూడు రోజుల అనంతరం గేదె ఆరోగ్యం మంచిగా అయింది. – నర్సింలు,
చిన్నగొట్టిముక్ల, శివ్వంపేట

మూగజీవాలకు భరోసా..

మూగజీవాలకు భరోసా..
Comments
Please login to add a commentAdd a comment