లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
డీఎంహెచ్‌ఓ శ్రీరామ్
మెదక్‌జోన్: ప్రైవేట్ ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ శ్రీరామ్ హెచ్చరించారు. సోమవారం తన కార్యాలయంలో జిల్లాలోని వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ప్రత్యేక అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆడపిల్లల భ్రూణహత్యలు, లింగ నిర్ధారణ పరీక్షలు తగ్గించడమే స్పెషల్ డ్రైవ్ లక్ష్యమన్నారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్ చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో వైద్యులు సునీతాదేవి, సృజన, జ్ఞానేశ్వర్, మాధవి, వినయ్ సుశీల్, శివదయాల్, శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment