‘ఏఐ’ అమలు తీరుపై ఆరా
నర్సాపూర్/తూప్రాన్: ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) కింద ఎంపికై న మండల ప్రజా పరిషత్ పాఠశాలను సోమవారం బెంగుళూరు ఈకే ఫౌండేషన్ సంస్థకు చెందిన టెక్నికల్ టీం సందర్శించింది. డీఈఓ రాధాకిషన్ వారికి పాఠశాలలో ప్రోగ్రాం అమలు తీరును వివరించారు. వారి వెంట ఎంఈఓ తారాసింగ్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మక్సూద్ అలీ, సిబ్బంది తదితరులు ఉన్నారు. అనంతరం బృందం సభ్యులు తూప్రాన్ పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు.
హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటాం
పాపన్నపేట(మెదక్): ఇటీవల గుండెపోటుతో మరణించిన పాపన్నపేట హెడ్ కానిస్టేబుల్ వీరప్ప కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం వీరప్ప భార్య నాగప్ప గారి బుజ్జమ్మకు రూ. 8 లక్షల చెక్కును ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. వీటితో పాటు విడో ఫండ్ రూ. 10 వేలు, కార్పస్ ఫండ్ రూ. 50 వేలను చెక్కుల రూపంలో ఇచ్చారు. మిగితా బెనిఫిట్స్ సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ కుటుంబాల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, ఏఓ మణి, సూపరింటెండెంట్ అనురాధ, జూనియర్ అసిస్టెంట్ రమేష్ పాల్గొన్నారు.
గోదాంలతో
ఎంతోమందికి ఉపాధి
మెదక్‌జోన్: సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ) 69వ వార్షికోత్సవ వేడుకలను సోమవారం మెదక్‌లో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మేనేజర్ కోటేశ్వర్‌రావు మాట్లాడుతూ.. దేశంలో హైదరాబాద్ రీజియన్ పరిధిలో వరుసగా మూడేళ్లుగా ఆదాయం అర్జిస్తూ ప్రథమ స్థానంలో ఉన్నామన్నారు. గోదాంలతో ఎందరికో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. అంతకుముందు హమాలీలతో పాటు సిబ్బందిని ఘనంగా సన్మానించారు.
ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీరామ్
టేక్మాల్(మెదక్): ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మండలంలోని తంప్లూర్ గ్రామానికి చెందిన పట్లోళ్ల శ్రీరామ్‌యాదవ్‌ను నియమించారు. ఈసందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ.. 2023లో హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎన్‌ఎస్‌యూఐ తరఫున జనరల్ సెక్రటరీ పోటీ చేసి విద్యార్థుల మద్దతు పొందినట్లు చెప్పారు. తన ఎన్నికకు సహకరించిన ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి, జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి జీ, జాతీయ ఇన్‌చార్జి కన్హయ్య కుమార్ తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండల నాయకులు శ్రీరామ్ యాదవ్‌ను అభినందించారు.
ప్రజావాణికి
24 వినతులు
మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజావాణికి 24 వినతులు వచ్చాయి. గత మూడు వారాలుగా హెల్ప్‌డెస్క్ ద్వారా అర్జీలు స్వీకరించారు. ఈ వారం అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
‘ఏఐ’ అమలు తీరుపై ఆరా
‘ఏఐ’ అమలు తీరుపై ఆరా
‘ఏఐ’ అమలు తీరుపై ఆరా
Comments
Please login to add a commentAdd a comment