చిన్నశంకరంపేట(మెదక్): ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగేలా సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నిరకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. అనంతరం అస్సత్రిలోని ఆయా విభాగాలను సందర్శించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. అస్పత్రి రికార్డులు, హాజరుపట్టికను తనిఖీ చేశారు.
శ్రీపాదరావుకు నివాళి
మెదక్ కలెక్టరేట్: మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని ఆదివారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ప్రజల కోసం శ్రీపాదరావు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి దామోదర్‌రెడ్డి, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్
Comments
Please login to add a commentAdd a comment