కాలువ ఇలా.. సాగు ఎలా!
గుర్రపు డెక్కతో నిండిన ఎంఎన్ కెనాల్ కాలువ
ఘనపూర్ ఆనకట్ట నుంచి మండల పరిధిలోని ఆయా గ్రామాలకు సరఫరా అయ్యే కాలువలో గుర్రపు డెక్క పేరుకుపోయింది. మండల పరిధిలోని ఎంఎన్ కెనాల్ ద్వారా ముత్తాయికోట, కూచన్‌పల్లి, ముత్తాయిపల్లి, సర్దన, ఫరీద్‌పూర్, పోచమ్మరాల్ గ్రామ శివారులోని పొలాలకు సాగునీరు సరఫరా అవుతుంది. దీంతో కూచన్‌పల్లి వద్ద కాలువలో గుర్రపు డెక్క పేరుకుపోయి చివరి ఆయకట్టు రైతులకు సాగునీరందక ఇబ్బంది పడుతున్నారు. కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించి సాఫీగా సాగు నీరు సరఫరా అయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
– హవేళిఘణాపూర్(మెదక్)
Comments
Please login to add a commentAdd a comment