వందలాది కోళ్ల మృత్యువాత
కొల్చారం(నర్సాపూర్): గంటల వ్యవధిలోనే వందలాది కోళ్లు మృత్యువాత పడిన సంఘటన మండలంలోని నాయిని జలాల్‌పూర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన సతీష్‌గౌడ్ ఉపాధి కోసం కొన్నినెలల క్రితం పౌల్ట్రీ ఫాం ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆదివారం ఏం జరిగిందో ఏమో ఒక్కసారిగా ఫాంలోని కోళ్లు ఒక్కొక్కటిగా మృత్యువాత పడసాగాయి. దీంతో అప్రమత్తమైన యజమాని మిగితా కోళ్లకు ప్రమాదం జరగకుండా వాటిని వెంట వెంటనే తొలగించారు. సుమారు 1,000 కోళ్లు మృత్యువాత పడ్డాయని, సుమారు రూ. 2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. అయితే ఒక్కసారిగా వందలాది కోళ్లు మృత్యువాత పడటంతో బర్డ్ ఫ్లూ వచ్చిందేమోనని గ్రామస్తులు ఆందోళన చెందారు. ఈ విషయమై జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్యను వివరణ కోరగా.. జిల్లాలో ఇప్పటివరకు ఒక్క బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాలేదని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సోమవారం పౌల్ట్రీ ఫాంను సందర్శించి నిర్ధారణ చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment