ఐఐటీ హైదరాబాద్‌లో ఉప రాష్ట్రపతి పర్యటన
సంగారెడ్డి జోన్: భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖఢ్ కంది శివారులోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో పర్యటించారు. ఆదివారం గవర్నర్ జిష్ణుదేవ్ శర్మతో కలిసి క్యాంపస్‌ను సందర్శించారు. మధ్యా హ్నం సుమారు 3:15 నిమిషాలకు మూడు ప్రత్యేక హెలిక్యాప్టర్ల ద్వారా క్యాంపస్‌కు చేరుకున్నారు. క్యాంపస్‌కు వచ్చిన వారికి గవర్నర్, ఐఐటీ హైదరాబాద్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ డాక్టర్ బీఆర్ మొహన్‌రెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ చెన్నూరి రూపేష్, ఎంపీ రఘునందన్‌రావు, ఐఐటీ హెచ్ డైరెక్టరు బీఎస్ మూర్తి, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి పుష్ఫగుచ్ఛాలు అందించి, మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతి పర్యటన ఉత్సాహంగా.. ఉల్లాసంగా సాగింది. క్యాంపస్ ఆవరణలో పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధికి ప్రోత్సహించే సంకేతంగా ఉప రాష్ట్రపతి భార్య డా.సుదేశ్ ధన్‌ఖఢ్‌తో కలిసి ఏక్ పేడ్ మా కె నామ్ పేరుతో మొక్క నాటి నీరు పోశారు. అనంతరం క్యాంపస్ సభాస్థలి వెళ్లారు. జాతీయ గీతాలాపన చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐఐటీ డైరెక్టరు బీఎస్.మూర్తి ఉప రాష్ట్రపతితో పాటు గవర్నర్‌కు శాలువాతో సన్మానించి, జ్ఞాపికలను బహూకరించారు. ఐఐటీ డైరెక్టరు ఐఐటీ సాధించిన ముఖ్యమైన విజయాలను వివరించారు. ఐఐటీ విద్యార్థులతో ముచ్చటించి, విద్యార్థులతో కలిసి ఫొటోలు దిగారు. అనంతరం ప్రత్యేక హెలిక్యాప్టర్లలో సుమారు 4:30 నిమిషాలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు.
ఐఐటీ విద్యార్థులు,
అధ్యాపకులు నాకు అతిథులు
ఐఐటీ విద్యార్థులు, అధ్యాపకులు తనకు అతిథులని, పార్లమెంట్‌ను సందర్శించాలని ఉపరాష్ట్రపతి కోరారు. భారత దేశం వివిధ భాషల నిలయమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment