
ఏడుపాయలలో భక్తుల సందడి
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల ఆదివారం జనసంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశా రు. అమ్మవారికి ఒడి బియ్యం పోసి, బోనాలు తీసి మొక్కులు తీర్చుకున్నారు. జాతరకు రాలేని వారు ఎక్కువ సంఖ్యలో తరలిరావడంతో ధర్మసత్రాలు దొరకక ఇబ్బంది పడ్డారు. చెట్ల కింద టెంట్లు వేసుకొని విందు చేసుకున్నారు. వాహనాల రద్దీతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈఓ చంద్రశేఖర్, ఎస్‌ఐ శ్రీనివాస్‌గౌడ్, ఆలయ ఉద్యోగులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఆధ్యాత్మిక కేంద్రంగా బుదేరా
మంత్రి దామోదర రాజనర్సింహ
మునిపల్లి(అందోల్): ఆధ్యాత్మిక కేంద్రంగా బుదేరాను తీర్చిదిద్దుతామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మండలంలోని బుదేరా శివారులో గల హనుమాన్ దేవాలయం వద్ద వైదిక పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బర్ధిపూర్ దత్తాత్రేయ పీఠాధిపతి అవధూత గిరి మహరాజ్ మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసం బుదేరా శివారులో వైదిక పాఠశాలను ఏర్పాటు చేసి కులమతాలకతీతంగా పిల్లలకు వేదాలు నేర్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిద్దేశ్వర్ మహరాజ్, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ మనోహర్ యాదవ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సతీష్ కుమార్, రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
జాతీయ సమైక్యత శిబిరానికి
తారా అధ్యాపకుడు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకుడు ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ జగదీశ్వర్ ఒడిశాలో జరిగే ఎన్‌ఎస్‌ఎస్ జాతీయ సమైక్యత శిబిరానికి ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె ఎస్ రత్నప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సహకారంతో ఒడిశా ఎన్‌ఎస్‌ఎస్ రీజినల్ డైరెక్టరేట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ శిబిరానికి రాష్ట్రం నుంచి ఆరుగురు ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు కలిగిన బృందం బయలుదేరుతుందని, ఈ బృందానికి కాంటినెంట్ లీడర్‌గా తమ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ అధికారి డాక్టర్ జగదీశ్వర్ వ్యవహారించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు జరుగుతుందనిన్నారు. జాతీయ సమైక్యత శిబిరానికి తమ కళాశాల అధ్యాపకుడు ఎంపిక కావడం పట్ల అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేసింది.
క్రీడల్లో రాణించే వారికి
బంగారు భవిష్యత్
రామచంద్రాపురం(పటాన్‌చెరు): క్రీడల్లో రాణించే వారికి బంగారు భవిష్యత్ ఉంటుంద ని తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు టి.రాజు అన్నారు. ఆదివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కొల్లూరు ఢీల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో జరిగిన రాష్ట్ర ఆర్చరీ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్‌షిప్ పోటీలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విజేయలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలలో రాణించే వారికి విద్య, ఉపాధి, ఉద్యోగాలలో ప్రత్యేక రిజర్వేషన్‌లు ఉంటాయని చెప్పారు. ఈ పోటీలలో సుమారు 500 మంది పాల్గొన్నారన్నారు. అందులో ఎంపికై న వారు ఈనెల 22న విజయవాడలో జరిగే జాతీయస్థాయి ఆర్చరీ క్రీడాల్లో పాల్గొంటారని చెప్పారు.
అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు

ఏడుపాయలలో భక్తుల సందడి

ఏడుపాయలలో భక్తుల సందడి

ఏడుపాయలలో భక్తుల సందడి
Comments
Please login to add a commentAdd a comment