చివరి ఆయకట్టుకూ నీరందించాలి
కలెక్టర్ రాహుల్‌రాజ్
హవేళిఘణాపూర్(మెదక్): ఎంఎన్ కెనాల్ మీదుగా మండలంలోని ఆయా గ్రామాలకు సాగు నీరు అందించే కాలువ గుర్రపు డెక్కతో నిండి ఉండడంతో ‘కాలువ ఇలా.. సాగునీరు ఎలా’ అనే కథనాన్ని ‘సాక్షి’ సోమవారం ప్రచురించింది. దీనికి స్పందించిన కలెక్టర్ రాహుల్‌రాజ్ మెదక్ మండలం మాచవరం, రాంపూర్ ఏరియాలో ఎంఎన్ కెనాల్‌ను ఆయన ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. వనదుర్గా ప్రాజెక్టు పరిధిలో ఉన్న పంటలు ఎండిపోకుండా సాగునీటిని అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వ ఆధారంగా సాగు నీటిని పొదు పుగా వాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారని వివరించారు. సింగూరు ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 21,625 ఎకరాలకు సాగునీరు సరఫరా చేయాల్సి ఉందని వెల్లడించారు. చివరి ఆయకట్టు రైతులకు సాగునీటికి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత ఇరిగేషన్ అధికారులదేనని స్పష్టం చేశారు. ఆయన వెంట ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు, ఏఈ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
పంటలు ఎండిపోకుండా చర్యలు
మెదక్‌జోన్: వేసవిలో పంటలు ఎండిపోకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ సచివాలయం నుంచి సీఎస్ శాంతకుమారి పంటలకు సాగునీటి వసతి కల్పించటంతో పాటు విద్యుత్‌ను నిరంతరంగా వ్యవసాయానికి ఇ వ్వాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు.
పకడ్బందీగా ఏఐ అమలు
మెదక్‌జోన్: విద్యాశాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో డీఈఓ రాధాకిషన్ ఆధ్వర్యంలో ఏఐ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన బెంగళూరు బృందంతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఏమైనా సమస్య ఉంటే క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సాఫ్ట్‌వేర్ బృందానికి సూచించారు.
స్పందన
చివరి ఆయకట్టుకూ నీరందించాలి
Comments
Please login to add a commentAdd a comment