కేంద్రం నిధులకు కిషన్‌రెడ్డే అడ్డు
మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
హుస్నాబాద్‌రూరల్: కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సోమవారం హుస్నాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు.కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి జరగడం ఇష్టంలేదని, అందుకే నిధులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులకు ప్రతిపాదనలు ఇచ్చి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. వరంగల్ ఎయిర్ పోర్టు తన వల్లనే వచ్చిందని పక్క రాష్ట్రం కేంద్ర మంత్రితో చెప్పించుకోనే దుస్థితి కిషన్‌రెడ్డికే దక్కిందన్నారు. వరంగల్ ఎయిర్ పోర్టు కోసం ఏనాడైనా కిషన్‌రెడ్డి ప్రయత్నం చేశారా? అని మంత్రి ప్రశ్నించారు. మరో కేంద్రమంత్రి బండి సంజయ్ కేసీఆర్‌కు బీనామీగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో మీకు బాధ్యత లేదా? నిధులు రాకుండా ఎందుకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. తమిళనాడు వంటి రాష్ట్రాలు అభివృద్ధి కోసం కలిసికట్టుగా పని చేస్తాయని, మన కేంద్ర మంత్రులు అభివృద్ధికి ఎందుకు సహకరించడం లేదన్నారు. నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 70 కులాలను ఓబిసీలో కలిపినట్లు చెప్పారన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment