చెక్ డ్యాం నిండుగా.. పైర్లు పచ్చగా
నీటితో కళకళలాడుతున్న చెక్ డ్యాం
కొల్చారం(నర్సాపూర్): సింగూరు నీటితో మండలంలోని మంజీరా పరివాహక ప్రాంతం పచ్చదనం పరుచుకుంది. కష్టకాలంలో సాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు మండలంలోని ఎనగండ్ల, కోనాపూర్, పైతర సమీపంలోని మంజీరా నదిపై చేపట్టిన చెక్ డ్యాంలు ప్రస్తుతం నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో సమీప ప్రాంతంలోని బోర్లలో భూగర్భజలాలు పెరిగి కనుచూపు మేరలో పచ్చని పొలాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. పంటపొలాలను చూస్తూ రైతన్నలు ఆనందంతో మురిసిపోతున్నారు.
చెక్ డ్యాం నిండుగా.. పైర్లు పచ్చగా
Comments
Please login to add a commentAdd a comment