ఇబ్బందులు తలెత్తొద్దు
కొల్చారం(నర్సాపూర్)/నిజాంపేట(మెదక్): వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు సౌకర్యాల కల్పనలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని డీఈఓ రాధాకిషన్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫే ర్, కేజీబీవీ బాలికల పాఠశాలతో పాటు బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వసతుల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు. వేసవి దృష్ట్యా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధా ్యపకులను ఆదేశించారు. అనంతరం నిజాంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏఐ తరగతులను పరిశీలించారు.
ఎల్‌ఆర్‌ఎస్‌ను
సద్వినియోగం చేసుకోండి
రామాయంపేట(మెదక్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రజ లు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ దేవేందర్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 31వ తేదీలోగా ప్రజలు తమ ప్లాట్లను క్రమబద్దీకరించుకోవాలని సూ చించారు. గడువులోగా చేసుకున్న వారికి 25 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించారు. ఈమేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా జీఓ విడుదల చేసిందని వివరించారు.
రాజీయే రాజమార్గం: ఎస్పీ
మెదక్ మున్సిపాలిటీ: జిల్లా ప్రజలు జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజీమార్గమే రాజమార్గం అనే సూత్రాన్ని అనుసరించి, వివాదాలను చక్కదిద్దుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశమన్నారు. వివాదాలు ఒకసారి ప్రారంభమైతే, జీవితాంతం కొనసాగుతూనే ఉంటాయని, వాటిని త్వరగా పరిష్కరించుకోవాలని అన్నారు. ఈనెల 8న కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కిక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శాంతి, న్యాయం పొందాలని సూచించారు.
తెలంగాణలో
బీజేపీ ప్రభుత్వం ఖాయం
చిన్నశంకరంపేట(మెదక్): రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆయన నార్సింగి మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలను కలిసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తుందన్నారు. పసుపు బోర్డు ద్వారా అధికశాతం తెలంగాణ రైతులకు మేలు జరగనుందన్నారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, ఇందుకు నిదర్శనం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలేనని అన్నారు. అనంతరం బీజేపీ నాయకులు సత్యపాల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్, నరేష్ తదితరులు గంగారెడ్డిని సత్కరించారు.
కనీస వేతనం
అమలు చేయాలి
మెదక్ కలెక్టరేట్: కార్మికులకు కనీస వేతనం నెలకు రూ. 26,000గా నిర్ణయించాలని సీఐటీ యూ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం కలెక్టరేట్‌లోని కార్మికశాఖ కార్యాలయంలో అసిస్టెంట్ లేబర్ అధికారి లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్మిక సంఘాలు ప్రతిపాదించిన వాటిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. అలాగే 74 షెడ్యూల్డ్ విడుదల చేసి కనీస వేతనాల సలహా మండలిలో కార్మిక సంఘాలన్నింటికీ ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు షౌకత్, రవి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇబ్బందులు తలెత్తొద్దు
ఇబ్బందులు తలెత్తొద్దు
Comments
Please login to add a commentAdd a comment