
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
మెదక్ కలెక్టరేట్: రాజీ మార్గమే రాజమార్గమని సీనియర్ సీవిల్ జడ్జి జితేందర్ తెలిపారు. మంగళవారం మెదక్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 8న మెదక్‌లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కక్షిదారుల సౌకర్యార్థం ఈనెల ఒకటో తేదీ నుంచే లోక్ అదాలత్ బెంచీలను ఆయా న్యాయస్థానాలలోనే ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ లోక్‌అదాలత్‌లో వేగంగా కేసులు పరిష్కారం అవటమే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నారు. కక్షిదారులు న్యాయస్థానానికి కట్టిన కోర్టు నుంచి ఫీజు తిరిగి పొందవచ్చునని వివరించారు. అలాగే.. కేసుపై అప్పీలుకు వీలులేకపోవటం వల్ల ఇదే చివరి తీర్పు అవుతుందని చెప్పారు.
సీనియర్ సివిల్ జడ్జి జితేందర్
Comments
Please login to add a commentAdd a comment