
వేసవిలో కూరగాయల సాగు బాగు
పీజేటీఏయూ శాస్త్రవేత్తలు
కౌడిపల్లి(నర్సాపూర్): వేసవిలో కూరగాయల సాగు చేసి అధిక లాభాలు పొందవచ్చని పీజేటీఏయూ (ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం) శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. మంగళవారం రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌడిపల్లి రైతువేదికలో అధికారులు, రైతులు పాల్గొని వీక్షించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులు వేసవి సందర్భంగా కూరగాయలు సాగు చేయడంవల్ల మంచి లాభాలు వస్తాయని సూచించారు. కాగా నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకుని ఎండా వేడిమిని తట్టుకునేలా షెట్‌నెట్, నీడపందిరి పద్ధతిలో కూరగాయలు సాగు చేయాలన్నారు. వర్షాకాలం ప్రారంభం నాటికి దిగుబడి వస్తే డిమాండ్ బాగా ఉంటుందని మంచి లాభాలు వస్తాయన్నారు. రైతులు వ్యవసాయ అనుంబంధంగా పాడిపశువులను పెంచాలని పాడి అభివృద్ధితో ఆర్థిక అభివృద్ది చెందవచ్చని శాస్త్రవేత్తలు సూచించినట్లు ఏఓ స్వప్న తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సౌజన్య, సాహితి, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment