
బాల్యవివాహాలపై అవగాహన
కౌడిపల్లి(నర్సాపూర్): గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించి బాల్యవివాహాలు జరగకుండా చూడాలని జిల్లా జెండర్ స్పెషలిస్ట్ నాగమణి తెలిపారు. మంగళవారం కౌడిపల్లి పీహెచ్‌సీలో మహిళా సాధికారత, బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా బాల్యవివాహాలపై ఆశావర్కర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యవివాహాలతో అనర్థాలు జరుగుతాయని, పెళ్లీడు వచ్చే వరకు పెళ్లి చేయవద్దని చెప్పారు. లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులు ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మండల వైద్యాధికారి శ్రీకాంత్ మట్లాడుతూ గర్భిణులు, బాలింతల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలనారు. ఈ కార్యక్రమంలో రమేష్ పాల్గొన్నారు.
జిల్లా జెండర్ స్పెషలిస్ట్ నాగమణి
Comments
Please login to add a commentAdd a comment