
మహిళా సంఘాలకు రుణాలు
డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌రావు
చిన్నశంకరంపేట(మెదక్): మహిళా సంఘాల సభ్యులకు రుణ సౌకర్యం కల్పిస్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌రావు అన్నారు. మంగళవారం నార్సింగి మండలం బీమ్‌రావుపల్లి గ్రామంలో మహిళ సంఘాల సభ్యులు నిర్వహించిన నామొక్క–నా బాధ్యత కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అలాగే మహిళ సంఘాల సభ్యులు నిర్వహిస్తున్న వ్యాపారాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. బ్యాంకు లింకేజీ రుణాలతో పాటు సీ్త్రనిధి రుణాలను సకాలంలో చెల్లించడం ద్వారా మరిన్ని రుణాలను పొందవచ్చన్నారు. రుణాలను తీసుకుని వ్యాపారం చేయడం ద్వారా వృద్ధి సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం ఆశోక్, సీసీలు సుల్తానా, శంకర్, గ్రామ కార్యదర్శి జగదీష్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment