
రికార్డులు పక్కా ఉండాలి
జెడ్పీ సీఈఓ ఎల్లయ్య
మనోహరాబాద్(తూప్రాన్): మండల పరిషత్ కార్యాలయాల్లో ఉండే రికార్డులు పక్కాగా ఉండాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య పేర్కొన్నారు. మంగళవారం మనోహరాబాద్ మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. కార్యాలయానికి సంబంధించిన పలు అంశాలపై ఎంపీడీఓ కృష్ణమూర్తిని అడిగి తెలుసుకున్నారు.
గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలి
చేగుంట(తూప్రాన్): గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అన్నారు. మంగళవారం చేగుంట ఎంపీడీఓ కార్యాలయంను సందర్శించారు.పాలకవర్గం లేకపోవడంతో గ్రామాల్లోని సమస్యలను త్వరగా పరిష్కరించేలా పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించాలని చెప్పారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటి సమస్యలను పరిష్కరించే విధంగా సంబంధిత సిబ్బందిని సిద్ధంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీశైలం, విజయ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment