ఏఐతో పక్కాగా విద్యాబోధన
● వచ్చే ఏడాది మరిన్ని పాఠశాలల్లో అమలు
● కలెక్టర్ రాహుల్‌రాజ్
వెల్దుర్తి(తూప్రాన్): జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథ)ను వినియోగిస్తూ విద్యాబోధన కార్యక్రమం పక్కాగా అమలు చేయనున్నట్లు కలెక్టర్ రాహుల్‌రా జ్ అన్నారు. బుధవారం మండల కేంద్రం మాసాయిపేటలో విస్తృతంగా పర్యటించారు. అంగన్‌వాడీ కేంద్రం, పశువైద్యశాల, ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చే సంవత్సరం మరిన్ని పాఠశాలల్లో ఏఐ అమలు జరిగేలా చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ జ్ఙానజ్యోతి, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం బాలమణి, పశువైద్యాధికారిణి కావ్య తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఏఐ విద్యాబోధన పరిశీలించేందుకు పాఠశాలకు వచ్చిన సమయంలో విద్యుత్ లేకపోవడంతో సంబంధిత అధికారులపై కలెక్టర్ ఫోన్‌లో ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్ది సేపటికి విద్యుత్ రాగా పాఠశాలకు చేరుకొని ఏఐతో విద్యాబోధనల అమలుతీరును పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment