రామాయంపేట(మెదక్): సీమాంధ్ర పాలనపై తెలంగాణ ప్రజల తిరుగుబాటు రోజు మార్చి 10న మిలియన్ మార్చ్‌డే నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు యాదగరి తెలిపారు. బుధవారం రామాయంపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈనెల 10న హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అమరులు కాగా, గత ప్రభుత్వం వారి గురించి ఎంతమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ఉద్యమకారుల ఆకాంక్షలను విస్మరించిందని మండిపడ్డారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు నెలకు రూ. 30 వేల గౌరవ వేతనంతో పాటు హైదరాబాద్‌లో 250 గజాల స్థలం ఇవ్వాలని కోరారు. సమావేశంలో జిల్లా కమిటీ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర నాయకులు దుర్గం, శ్రీనివాస్, జేఏసీ రాష్ట్ర నాయకులు తుల్జారెడ్డి, లక్ష్మీకాంతమ్మ, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment