నర్సాపూర్ రూరల్: యువజన ఉత్సవాల్లో నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మంగళవారం జిల్లా కేంద్రంలో కేంద్ర యువజన, వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక, పెయింటింగ్, ఫొటోగ్రఫీ, ఉపన్యాస, సైన్స్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో కళాశాల విద్యార్థి వైష్ణవి బృందం నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్కులో సీతాకోక చిలుకల సంరక్షణ విధానంపై నిర్వహించిన ప్రాజెక్టు మొదటి బహుమతి సాధించింది. వారు రూ. 7 వేల నగదు బహుమతి అందుకున్నారు. జానపద నృత్య ప్రదర్శనలో విద్యార్థిని సంపూర్ణ బృందం తృతీయ బహుమతి, కవితా రచన పోటీల్లో విద్యార్థి మహేక్ తృతీయ బహుమతి గెలుచుకున్నారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ దామోదర్, అధ్యాపకులు డాక్టర్ సురేష్ కుమార్ ఇతరులు విద్యార్థులను అభినందించారు.