
గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ
జహీరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి 6,7,8,9వ తరగతులలో మిగిలి ఉన్న ఖాళీల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఝరాసంగం, దిగ్వాల్ బాలుర గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హరీశ్వర్‌రెడ్డి కోరారు. ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 20న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు.