స్టేడియం ఏర్పాటు చేయాలి
మున్సిపాలిటీలో ఇండోర్, మినీ స్టేడియాలు లేక ఇబ్బంది పడుతున్నాం. కాలేజీ మైదానంలో చిన్న చిన్న గుంతలున్నా వాకింగ్ చేస్తున్నాం. ఇప్పటికై నా స్టేడియం నిర్మించి క్రీడాకారులు, వాకర్స్‌ను ప్రోత్సహించాలి.
– నర్సింగ్‌రావు, క్రీడాకారుడు, నర్సాపూర్
మార్కెట్ తరలించాలి
జాతీయ రహదారి నుంచి షాదీఖానా వెళ్లే రోడ్డుకు ఇరువైపులా కూరగాయల దుకాణాలు పెట్టడంతో ఇరుకుగా మారి రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. మార్కెట్ యార్డు పూర్తి చేసి కూరగాయల దుకాణాలను తరలించాలి.
– బోడ చైతన్య, పట్టణ వాసుడు
సరిపడా నీరు రావడం లేదు
తమ ఏరియాలో ఒక్కో ఇంటికి ఐదు బిందెల నీరు మాత్రమే రావడంతో సరిపోవడం లేదు. బోర్ల ద్వారా నీరు తెచ్చుకుంటూ అవసరాలు తీర్చుకుంటున్నాం. ఇప్పటికై నా తాగు నీరు సరిపడా సరఫరా చేయాలి.
– కళమ్మ, ఎన్జీఓస్ కాలనీ
నిధులు రాగానే పూర్తి చేయిస్తాం
నిఽదులు లేక కొత్త భవనాల నిర్మాణాలు నిలిచిపోయాయి. నిధులు రాగానే పనులు పూర్తి చేయిస్తాం. మిషన్ భగీరథ నీరు అంతటా వస్తున్నాయి. ఆయా వార్డులలో నీరు తక్కువగా వస్తున్నట్లు తనకు తెలియదు. అంతటా సక్రమంగా నీరు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటా. మురికి నీరు చెరువులోకి, కుంటలోకి వెలుతున్న విషయం నా దృష్టికి రాలేదు. వాటిలోకి మురికి నీరు వెళ్లకుండా చర్యలు తీసుకుంటా.
– రామకృష్ణరావు, కమిషనర్
●
స్టేడియం ఏర్పాటు చేయాలి
స్టేడియం ఏర్పాటు చేయాలి
స్టేడియం ఏర్పాటు చేయాలి
Comments
Please login to add a commentAdd a comment