ఒకేదేశం ఒకేఎన్నికతో ఎంతోమేలు
మెదక్‌జోన్: ఒకే దేశం ఒకే ఎన్నికతో కేంద్ర, రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందని, ప్రజాధనం వృథా కాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దార్ మల్లేశం గౌడ్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పలువురి సలహాలు, సూచనలు తీసుకుంటూ జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఎన్నికల నిర్వహణలో సమూల మార్పులు వస్తాయని, లోక్‌సభ, అసెంబ్లీలకు కలిపి దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే భారీగా ప్రజాధనం ఆదా అవుతాయన్నారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల పోలింగ్ శాతం సైతం పెరుగుతుందని తెలిపారు. 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమిలి ఎన్నికల ఆలోచనలను ప్రతిపాదించగా, దీనిపై 2017లో నీతి ఆయోగ్ కసరత్తు చేసిందని వివరించారు. 2022 డిశంబర్‌లో జమిలి ఎన్నికలపై లా కమిషన్ వివిధ పార్టీలు, ఈసీ, అధికారులు, విద్యావేత్తలు, నిపు ణుల, అభిప్రాయాలను ఆహ్వానించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్
Comments
Please login to add a commentAdd a comment