
అందరికీ శుభాలు కలగాలి
హుస్నాబాద్: నూతన తెలుగు సంవత్సరాది నుంచి అందరికీ శుభాలు కలగాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంచాంగ శ్రవణం కార్యక్రమంలో మంత్రి పొన్నం దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. షడ్రుచుల పచ్చడి, బక్ష్యాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమృద్ధిగా పాడి పంటలతో అందరూ సుఖంగా జీవించాలన్నారు. ప్ర జాపాలన ప్రభుత్వంలో ప్రజలందరికీ మేలు జరిగేలా భగవంతుడి ఆశీర్వాదం అందాలని కోరారు.
ప్లాస్టిక్‌ను నివారిద్దాం..
ప్లాస్టిక్‌ను నివారిద్దామని, స్టీల్ గ్లాస్‌లు మేలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం పట్టణంలోని హోటల్ యాజమానులకు స్టీల్ గ్లాస్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్లాస్టిక్ గ్లాస్‌లో చాయ్ తాగడం వల్ల అనారోగ్యాలకు గురవుతున్నామన్నారు. పట్టణంలో 50 హోటల్స్ ఉన్నాయని, ప్రతి హోటల్‌కు వంద గ్లాస్‌ల చొప్పున పంపిణీ చేశామన్నారు.
ఉగాది వేడుకల్లో
మంత్రి పొన్నం ప్రభాకర్