తెలుగులో హీరోయిన్లకు అస్సలు కొదవ ఉండదు. ప్రతి ఏడాది వందలకొద్ది సినిమాలు వస్తూనే ఉంటాయి. పదుల సంఖ్యలో కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. ఎక్కడో ఛండీగఢ్‌లో పుట్టిన ఈ బ్యూటీ కూడా అదృష్టం పరీక్షించుకుందామని టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీకే మంచి క్రేజ్ తెచ్చుకుంది. మరి ఇంతలా చెప్పాం కదా ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? లేదా చెప్పేయమంటారా?
పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సమీక్ష. పంజాబీ ఫ్యామిలీకి చెందిన ఈమె.. ఆ తర్వాత ముంబయిలో వచ్చి సెటిలైంది. ఇకపోతే యంగ్ ఏజ్ లో మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈమె.. పూరీ జగన్నాథ్ దృష్టిలో పడింది. దీంతో తన తమ్ముడిని హీరోగా పెట్టి తీసిన '143' మూవీలో ఈమెని హీరోయిన్‌గా తీసుకున్నాడు. ఇందులో యాక్టింగ్‌తో మంచి పేరు తెచ్చుకుంది.
(ఇదీ చదవండి: 'జైలర్'ని కోర్టు మెట్లు ఎక్కించిన ఆర్సీబీ జెర్సీ)
ఇక ఈ సినిమా తర్వాత తమిళ, కన్నడ, హిందీలో నటించిన సమీక్ష... కొత్త కథ, ఇదీ సంగతి, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, సామ్రాజ్యం, దడ, కులుమనాలి తదితర చిత్రాల్లో నటించింది. కానీ ఈమె బ్యాడ్‌లక్ వల్ల వాటిలో ఏ మూవీ కూడా హిట్ కాలేదు. ఈమెని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో కొత్త ఛాన్సులు రాకపోవడంతో.. మాతృభాష పంజాబీలో మూవీస్ చేస్తూ బిజీ అయిపోయింది.
ఇక సినిమాలు తగ్గిపోవడంతో సీరియల్స్ లోనూ యాక్ట్ చేస్తూ బిజీ అయిపోయిన ఈ బ్యూటీ.. 2020లో సింగర్ షాహిల్ ఒస్వాల్ ని పెళ్లి చేసుకుని సింగపూర్‌లో సెటిలైపోయింది. అప్పటినుంచి సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈమె వయసు 37 ఏళ్లు. అయినాసరే అప్పట్లో తెలుగులో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అదే అందం మెంటైన్ చేస్తూ ఆకట్టుకుంటోంది.
(ఇదీ చదవండి: మనసు మార్చుకున్న చిరు.. ఇకపై కేవలం!?)
Comments
Please login to add a commentAdd a comment