![Actor Allu arjun Attend To Nampally Court](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/27/allu-arjub.jpg.webp?itok=xFWPcgbR)
సంధ్య థియేటర్ ఘటనలో నేడు నాంపల్లి కోర్టుకు నటుడు అల్లు అర్జున్ ఆన్‌లైన్ ద్వారా హాజరుకానున్నారు. పుష్ప2 ప్రీమియర్స్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ కారణం అంటూ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ సమయంలో బన్నీని చంచల్‌గూడ జైలుకు కూడా తరలించారు. అయితే, అదే కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
అయితే, నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రీమాండ్ నేటితో పూర్తి అవుతుంది. రిమాండ్ గడువు పూర్తి అయిన తర్వాత జరిగే ప్రాసెస్‌లో భాగంగా అల్లు అర్జున్ వర్చువల్‌గా కోర్టులో హాజరుకానున్నారు. ఆపై ఆయన తరపు లాయర్లు నాంపల్లి కోర్టుకు హాజరై అల్లు అర్జున్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు తెలపనున్నారు. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును సంప్రదించాలని గతంలోనే అల్లు అర్జున్ న్యాయవాదులకు హైకోర్టు సూచించింది. దీంతో వారు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉంది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరణించిన రేవతి కుటుంబానికి రూ.2కోట్ల సాయం పుష్ప2 టీమ్ అందించింది. అల్లు అర్జున్ తరపున రూ. కోటి, పుష్ప2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ.50లక్షలు అందించిన విషయం తెలిసిందే. రేవతి కుమారుడు శ్రేతేజ్ కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. అతని ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని ఇప్పటికే వైద్యులు కూడా ప్రకటించారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/18_24.png)
Comments
Please login to add a commentAdd a comment