
చిరంజీవి ఎన్నో కష్టనష్టాలు పడి మెగాస్టార్ అయ్యారు. తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్నారు. అయితే తనకెదురైన ఇబ్బందుల్ని పెద్దగా చెప్పుకోవడానికి చిరు ఇష్టపడరు. అప్పుడప్పుడు మాత్రం బయటపడుతుంటారు. ఇప్పుడూ అలానే తను గతంలో కొన్ని వార్తల వల్ల బాధపడ్డానని చెప్పారు. తాజాగా ఓ పుస్తకావిష్కరణలో పాల్గొన్న ఆయన.. ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇంతకీ ఏం జరిగింది?
ఓ సీనియర్ జర్నలిస్ట్ తాను రాసిన కొత్త పుస్తకాన్ని చిరంజీవి చేతుల మీదగా ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని చిరు నివాసంలోనే ఈ కార్యక్రమం జరిగింది. ఇక బుక్ లాంచ్ తర్వాత మాట్లాడిన చిరు.. 'తన కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి సినీ రచయితలు, జర్నలిస్టులతో తనకు విడదీయలేని అనుబంధం ఉందని అన్నారు'
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7: సడన్‌గా హౌస్‌లో నుంచి వెళ్లిపోయిన కంటెస్టెంట్!)
'అలానే జర్నలిస్టుల పెన్నుకు ఉన్న పవర్ అంతా ఇంతా కాదని, దాని ద్వారా మంచి చెప్పొచ్చు. కానీ కొందరు జర్నలిస్టులు రాసిన న్యూస్ దుమారం సృష్టిస్తుంటాయి. నేను కూడా కొన్ని వార్తల వల్ల బాధపడిన సందర్భాలు ఉన్నాయి. వాటి ప్రభావం ఇంకా నా జీవితంపై ఉంది' అని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు.
ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిన చిరు.. ఓ హిట్, ఓ ఫ్లాప్ అందుకున్నారు. ప్రస్తుతం 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. దీని తర్వాత కల్యాణ్ కృష్ణ, త్రివిక్రమ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరనేది త్వరలో ఖరారు కానుంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు రిలీజ్)
Comments
Please login to add a commentAdd a comment