తెలుగులో పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న మరో హీరోయిన్ పెళ్లి చేసుకుంది. ఇండస్ట్రీలోనే సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్న కుర్రాడితోనే ఏడడుగులు వేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే అందరూ సదరు హీరోయిన్‌కి శుభాకాంక్షలు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: అభిమాని వింత కోరిక తీర్చిన 'గ్యాంగ్ లీడర్' హీరోయిన్!)
ముంబయి బ్యూటీ అక్ష.. 2004లోనే చైల్డ్ ఆర్టిస్టుగా 'ముసాఫిర్' అనే సినిమా చేసింది. 2007లో 'గోల్' అనే మలయాళ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2008లో 'యువత' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వరసగా తెలుగులోనే 'రైడ్', 'అది నువ్వే', కందిరీగ, శత్రువు, రయ్ రయ్, బెంగాల్ టైగర్, డిక్టేటర్, మెంటల్ పోలీస్, రాధ చిత్రాల్లో నటించింది. అయితే 2017 తర్వాత ఈమెకు సినిమా ఛాన్సులు తగ్గిపోయాయి.
సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో 'జమత్రా', 'కాట్మండు కనెక్షన్', 'రఫుచక్కర్' లాంటి వెబ్ సిరీసుల్లో నటించింది. మంచి పేరు తెచ్చుకుంది. ఇలా వెబ్ సిరీసులు చేస్తున్న టైంలోనే సినిమాటోగ్రాఫర్ కౌశల్‌తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. గతేడాది నిశ్చితార్థం జరగ్గా.. తాజాగా ఫిబ్రవరి 26న పెళ్లి వేడుకతో ఒక్కటయ్యారు. ఆ ఫొటోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఈమెకు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment