అలనాటి హీరోయిన్‌ భానుప్రియ ఇంట తీవ్ర విషాదం | Actresses Bhanu Priya And Shanthi Priya Mother Passed Away Due To Heart Attack At Age Of 83 | Sakshi
Sakshi News home page

అలనాటి హీరోయిన్‌ భానుప్రియ తల్లి కన్నుమూత

Mar 24 2026 6:55 AM | Updated on Mar 24 2026 10:03 AM

Actress Bhanu Priya, Shanthi Priya Mother Passed Away

అలనాటి హీరోయిన్లు భానుప్రియ, శాంతిప్రియ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వారి తల్లి ఎం. లక్ష్మి (83) ఆదివారంనాడు గుండెపోటుతో కన్నుమూశారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు చెన్నైలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఎం.లక్ష్మికి భానుప్రియ, శాంతిప్రియతో పాటు గోపాలకృష్ణ అనే కుమారుడు ఉన్నాడు. ఇద్దరు కూతుర్లను సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా తీర్చిదిద్దారు లక్ష్మి. 

భానుప్రియ
కాగా భానుప్రియ 1998లో ఆదర్శ్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. వీరికి కూతురు అభినయ సంతానం. కొంతకాలానికి భార్యాభర్తల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. దీంతో 2005లో అతడి నుంచి విడిపోయి కూతుర్ని తీసుకుని చెన్నైకి వచ్చి తల్లితోనే కలిసి ఉంటోంది. 2018లో నటి మాజీ భర్త ఆదర్శ్‌ కౌశల్‌ గుండెపోటుతో మరణించాడు. 

శాంతిప్రియ
భానుప్రియ చివరగా అయాలన్‌ అనే తమిళ సినిమాలో కనిపించింది. శాంతిప్రియ విషయానికి వ్తే.. ఈమె ప్రముఖ దర్శకుడు వి.శాంతారాం మనవడు, నటుడు సిద్దార్థ్‌ రాయ్‌ను పెళ్లి చేసుకుంది. 1992లో వీరి వివాహం జరగ్గా ఈ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. 2004లో సిద్దార్థ్‌ కూడా గుండెపోటుతోనే కన్నుమూశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement