హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ మధ్య తెగ కనిపించేస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా గతేడాది పలు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిన కాజల్.. కొత్త ఏడాది మరికొన్ని మూవీస్‌తో ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయిపోయింది. కెరీర్ పరంగా పర్వాలేదనిపిస్తున్న కాజల్.. ఫ్యామిలీకి పూర్తి సమయాన్ని కేటాయిస్తోంది. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా కుటుంబంతో కలిసి చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది.
(ఇదీ చదవండి: టాలీవుడ్ లక్కీ హీరోయిన్ పెళ్లి చేసుకోనుందా? అందుకే ఇలా!)
కొత్త సంవత్సర వేడుకల్లో కాజల్ అగర్వాల్‌తోపాటు ఫ్యామిలీ అంతా కనిపించాడు. కొడుకు నీల్, భర్త గౌతమ్ కిచ్లూ కూడా ఉన్నారు. ఇన్ స్టాలో పోస్ట్ చేసిన మిగతా ఫొటోలన‍్నింటి గురించి పక్కనబెడితే భర్త గౌతమ్‌ని ఘడంగా ముద్దుపెట్టుకున్న పిక్ మాత్రం తెగ వైరల్ అయిపోయింది. ఫొటో చూస్తుంటే ఇద్దరూ ఫుల్ చిల్ మూడ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సో అదన్నమాట విషయం.
(ఇదీ చదవండి: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న 'దసరా' విలన్.. అమ్మాయి ఎవరో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment