ప్రయాణం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జులాయి, పడిపడి లేచే మనసు చిత్రాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి కల్పికా గణేశ్. ఇటీవలే సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద మూవీలో ముఖ్య పాత్ర పోషించింది కల్పిక. అయితే హీరోయిన్స్ కంటే అందంగా కనిపిస్తున్నానని తనను పక్కన పెడుతున్నారని దానివల్లే తక్కువ సినిమాలు చేశానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అంతేగాక సమంతలాగే తాను కూడా పదమూడేళ్లుగా మయోసైటిస్‌తో పోరాడుతున్నాడన్న విషయాన్ని బయటపెట్టింది.
ఈ క్రమంలో తాజాగా కల్పిక ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. లుంబార్ రాడిక్యులోపతి విజయవంతమైందని తెలిపింది. ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్.. నా పోరాటం చివరికి ఎలాంటి సత్ఫలితాలనిస్తుందో చూడాలి అని రాసుకొచ్చింది. కల్పిక రాడిక్యులర్ పెయిన్‌కు ఆమె ఈ చికిత్స చేయించుకుంది. రాడిక్యులర్ పెయిన్ అంటే వెన్నెముక ద్వారా నొప్పి తొడలు, పాదాల వరకు ప్రయాణిస్తుంది. దీనివల్ల మనిషి ఎక్కువసేపు నిల్చోలేకపోవడంతోపాటు బలహీనంగా మారుతారు. కాగా పదమూడేళ్లుగా మయోసైటిస్‌తో పోరాడుతున్న కల్పికా త్వరలోనే కోలుకుని పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు అభిమానులు.
చదవండి: నరాలు కట్టయ్యాయా శివ? రాజ్‌తో పిచ్చిగా వాగుతున్నావ్!
ఆదిరెడ్డి వర్సెస్ శ్రీహాన్.. నామినేషన్స్‌లో ఆరుగురు
Comments
Please login to add a commentAdd a comment