
యశోద సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించి ఇటీవలే తెలుగు ప్రేక్షకులను పలకరించింది కల్పిక గణేశ్. తరచూ వివాదాలతోనే సావాసం చేస్తున్న ఆమె ఇటీవల ఓ అవార్డుల ఫంక్షన్‌కు పిలవకపోయినా వెళ్లింది! ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా స్టేజీ ఎక్కి మరీ చెప్పింది. నన్నెవరూ ఈ ఫంక్షన్‌కు ఆహ్వానించలేదని, అయినా సరే వచ్చేశానంటూ మైక్ తీసుకుని మాట్లాడింది. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ..
'నన్నెవరూ పిలవలేదు. కానీ ఇండస్ట్రీని నా ఇల్లుగా భావిస్తాను. అందుకే పిలవకపోయినా ఏ మొహమాటం లేకుండా వచ్చేశాను. ట్రోల్స్ అంటారా? వాళ్లు చేస్తూనే ఉంటారు. జనాలకు నిజాలేంటో తెలియాలనే చాలామంది నిజస్వరూపాలను బయటపెడుతున్నాను.
ధనుష్, ధన్య బాలకృష్ణ, అనిరుధ్, బాలాజీ మోహన్.. ఇలా కొందరి గురించి అసలు నిజాలు బయటకు రావాలి. సుచీలీక్స్ ఊరికే బయటకు రాలేదు. చిన్మయి కూడా ఎంతో ఫైట్ చేసింది కానీ ఆమెను క్లోజ్ చేశారు. ఈ కొత్త సంవత్సరంలో ఇంకా చాలామంది బండారాలు బయటపెడతా' అని చెప్పుకొచ్చింది కల్పికా గణేశ్.
చదవండి: సెట్స్‌లో 20 ఏళ్ల నటి ఆత్మహత్య
తండ్రి సంవత్సరీకం.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
Comments
Please login to add a commentAdd a comment