
తమిళసినిమా: రన్ చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన మలయాళీ బ్యూటీ మీరా జాస్మిన్. ఈ చిత్ర విజయం ఇక్కడ ఈమె స్థానాన్ని పదిలం చేసిందనే చెప్పాలి. అలాగే విశాల్‌కు జంటగా నటించిన సండైకోళి చిత్రం మీరా జాస్మిన్ స్థాయిని మరింత పెంచింది. ఆ చిత్రంలో అందరినీ ఆటపట్టించే అల్లరి పిల్లగా ఆమె నటన ఆకట్టుకుంది. అలా మణిరత్నం దర్శకత్వంలో ఆయుధ ఎళుత్తు చిత్రంతో స్టార్ ఇమేజ్‌ను తెచ్చుకుంది.
ఈమె తెలుగులో పలు చిత్రాల్లో నటించి బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంది. అయితే గ్లామర్‌కు దూరంగా పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న మీరాజాస్మిన్ వ్యక్తిగతంగా పలు సమస్యలను ఎదుర్కొంది. ముఖ్యంగా వైవాహిక జీవితంలో పలు ఒడిదుడుకులను చవి చూడాల్సి వచ్చింది. ఆ ప్రభావం తన నట జీవితంపైనా పడింది. అలా సక్సెస్‌ఫుల్ నటిగా కొనసాగిన మీరా జాస్మిన్ అనూహ్యంగా నటనకు దూరమైంది.
ఈమె తమిళంలో నటించిన చివరి చిత్రం విజ్ఞాని. కాగా చాలా గ్యాప్ తరువాత మీరాజాస్మిన్ మళ్లీ నటించడానికి సిద్ధమైంది. అలా మలయాళం అడపాదడపా అవకాశాలను రాబట్టుకుంటోంది. మలయాళం జయరాంకు జంటగా నటించిన మక్కల్ అనే చిత్రం గత ఏప్రిల్ నెలలో విడుదలైంది. కాగా మరిన్ని అవకాశాలను ఇతర భాషల్లోనూ రాబట్టుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
అందుకు గ్లామర్ బాట పట్టింది. ఇప్పుడీ అమ్మడి వయసు 40 ఏళ్లు. అయినా 20 ఏళ్ల యువతిలా ఈ తరం హీరోయిన్లకు తగ్గేదేలా అన్నట్లు స్పెషల్ ఫొటో షూట్‌తో గ్లామరస్ పొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తోంది. ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే అవి ఆమెకు ఎంతవరకు కథానాయకి అవకాశాలు తెచ్చి పెడుతాయన్నది వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment