
సినిమాలు చూసే ప్రతి ఒక్కరికీ నటి ప్రగతి సుపరిచితురాలే. హీరో, హీరోయిన్ తల్లి పాత్రల్లో లేదంటే అక్క, వదినమ్మల పాత్రల్లో నటించి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుందీవిడ. దాదాపు దశాబ్ద కాలంగా వెండితెర మీద అలరిస్తున్న ఈ నటి తన డ్యాన్స్ వీడియోలతో లాక్‌డౌన్‌లో మరింత పాపులర్ అయింది. తాజాగా ఆమె జిమ్‌లో చెమటోడ్చుతున్న వీడియోలను షేర్ చేసింది. అయితే దీనిపై కొందరు నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తూ ఆమెను కించపరుస్తూ కామెంట్లు చేశారు. 'అక్కా.. ఎందుకే ఇంత కష్టం? కుస్తీ పోటీలకు ఏమైనా పేరు ఇచ్చావా?' అని ఓ వ్యక్తి వెటకారంగా ప్రశ్నించాడు.
ఇది చూసి చిర్రెత్తిపోయిన ప్రగతి అతడికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. 'నీకు ఇలా నెగెటివ్ కామెంట్స్ పెట్టి డీమోటివేట్ చెయ్యటం ప్యాషన్ ఐతే... నాకు ఫిజికల్ ఫిట్‌నెస్ ప్యాషన్.. మీకు నచ్చినట్లుగా కాదు, నాకు నచ్చినట్లు నేనుంటా' అని కౌంటర్ ఇచ్చింది. ఆమె సరిగ్గా చెప్పిందని కొందరు నెటిజన్లు ప్రగతిని వెనకేసుకొస్తూ.. ఆరోగ్యంగా ఉండటం కూడా తప్పే అయిపోయింది జనాలకు.. అంటూ విమర్శకులను తిట్టిపోశారు. కాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' జూన్ 19న రిలీజవుతోంది. ఇందులో అఖిల్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించారు.
Comments
Please login to add a commentAdd a comment