చిరు-మహేశ్‌తో సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడేమో ఇలా! | Actress Sakshi Shivanand Recent Pics Viral | Sakshi
Sakshi News home page

Guess The Actress: ఈ ఫొటోలోని ఇద్దరు బ్యూటీస్ తెలుగు హీరోయిన్లే.. కనిపెట్టండి చూద్దాం?

Published Sat, Feb 17 2024 9:28 PM | Last Updated on Sat, Feb 17 2024 9:30 PM

Actress Sakshi Shivanand Recent Pics Viral

ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్. చాలా చిన్న వయసులోనే ఏకంగా చిరంజీవి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మహేశ్, నాగార్జున లాంటి అగ్ర హీరోల చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. కెరీర్ సాఫీగా సాగుతోందనుకునే టైంలో సడన్‌గా సినిమాలకు వీడ్కోలు చెప్పేసింది. తాజాగా ఈమెకు సంబంధించిన ఓ ఫొటో వైరల్ కావడంతో మళ్లీ చర్చనీయాంశంగా మారిపోయింది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

(ఇదీ చదవండి: సీక్రెట్‌గా రెండోసారి నిశ్చితార్థం చేసుకున్న స్టార్ హీరోయిన్)

పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ పేరు సాక్షి శివానంద్. ఇప్పటి జనరేషన్‌కి ఈమె పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే 1993లో 'అన్నా వదిన' అనే చిత్రంతో తెలుగులోకి వచ్చింది. కానీ దాదాపు నాలుగేళ్ల తర్వాత అంటే 1997లో చిరంజీవి 'మాస్టర్'తో పూర్తిస్థాయి హీరోయిన్‌గా ఎం‍ట్రీ ఇచ్చింది. 2001 వరకు వరసపెట్టి మూవీస్ చేసింది. కలెక్టర్ గారు, ఇద్దరు మిత్రులు, సీతారామరాజు, వంశోద్దారకుడు, యువరాజు, సింహరాశి లాంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది.

2001లో రాజశేఖర్ 'సింహరాశి' సినిమాలో సాక్షి శివానంద్ హీరోయిన్‌గా హిట్ కొట్టింది. కానీ ఆ తర్వాత ఎందుకో తెలుగు సినిమాల్లో ఛాన్సులు సరిగా రాలేదు. 2008లో 'హోమం', 2010లో 'రంగా ది దొంగ' చిత్రాల్లో చివరగా కనిపించింది. ఆ తర్వాత పూర్తిగా తెలుగు చిత్రాలకే దూరమైపోయింది. అనంతరం సాగర్ అనే  వ్యక్తిని పెళ్లి చేసుకుని పూర్తిగా గృహిణిలా మారిపోయింది. ఈమెకు ఒహానా శివానంద్ అనే చెల్లెలు ఉంది. పైన చూసిన ఫొటోలో సాక్షితో పాటు ఉన్నది ఒహానే. అయితే సాక్షి అప్పుడెలా ఉందో ఇప్పటికీ అంతే అంతంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: ఈ ప్రేమ ఎప్పటికీ ప్రత్యేకమే: హీరోయిన్ సమంత)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement