![Actress Sanjana Galrani Reveals Secrets About Her Marriage Doctor Pasha - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/5/sanjana.gif.webp?itok=1RDnMDKH)
Sanjana Galrani: శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టై, ఇటీవల బెయిల్‌పై విడుదలైన హీరోయిన్ సంజన గల్రానీ రహస్యంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కర్ణాటకకు చెందిన డాక్టర్ పాషాను సంజన పెళ్లి చేసుకుంది. గతేడాది లాక్ డౌన్‌లోనే వివాహం చేసుకున్న సంజన.. ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టింది. అలాగే రహస్యంగా ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో కూడా వివరించింది. ‘పెళ్లి ఫిక్స్ అయిన వెంటనే డ్రగ్స్ కేసు ఇష్యూలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో నా పెళ్లి విషయాన్ని ఇండస్ట్రీ వర్గాల వారితో పంచుకోలేకపోయాను. అయితే అందర్నీ పిలిచి రిసెప్షన్‌ని గ్రాండ్‌గా చేసుకోవాలనుకున్నాం. కానీ లాక్‌డౌన్ వల్ల అది సాధ్యం కాలేకపోయింది’అని సంజన ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.
తెలుగులో పూరి జగన్నాథ్, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బుజ్జిగాడు’సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సంజన. ఈ చిత్రం తర్వాత ‘సత్యమేవ జయతే’, ‘అవును 2’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తదితర సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కన్నడ పరిశ్రమకే పరిమితమైంది. శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టై, మూడు నెలలపాటు జైల్లో ఉండి బెయిల్ పై బయటికొచ్చింది.
చదవండి :
డైరెక్టర్‌ను పెళ్లాడిన ప్రముఖ హీరోయిన్
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో హీరో ఆశీష్ గాంధీ పెళ్లి.. ఫోటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment