తెలుగమ్మాయి తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని నిరూపించింది శోభిత ధూళిపాళ. తన తొలి సినిమా రామన్ రాఘవ్ 2.0 (హిందీ మూవీ). గూఢచారి సినిమాతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసిందీ బ్యూటీ. మేజర్ మూవీతో బ్లాక్‌బస్టర్ అందుకుంది. పొన్నియన్ సెల్వన్ మూవీతో దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓటీటీ ప్రాజెక్టులతో మరింత ఫేమస్ అయింది. మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్‌లతో బాలీవుడ్‌లోనే ఎక్కువ క్లిక్ అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ మూవీలో నటిస్తోంది. అలాగే సితార అనే హిందీ చిత్రం చేస్తోంది.
పెద్ద లక్ష్యాలు లేవు
తాజాగా ఆమె జీవితానికి అసలైన అర్థం ఏంటన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చింది. శోభిత మాట్లాడుతూ.. 'జీవితానికి ఓ లక్ష్యం ఉంటుందని నేననుకోవడం లేదు. ఒక తీరం నుంచి మరొక తీరానికి వెళ్తూ ఉండాలి. మనం ఏం చేసినా దాన్ని ఆనందంతో చేయాలి. నాకంటూ పెద్దపెద్ద లక్ష్యాలు లేవు కాబట్టి ఏదో పొగొట్టుకున్నదానిలా ఉండలేను. కానీ కొన్నిసార్లు నాకు తెలియకుండానే అన్నింటికీ డిస్‌కనెక్ట్ అవుతుంటాను.
అమ్మ అన్న పిలుపుకోసం వెయిటింగ్
జీవితంలో నేను ఏం కోరుకుంటున్నానంటే.. మాతృత్వం. నిజంగా దాన్ని ఎప్పుడు అనుభవిస్తానో కానీ అదొక అద్భుతంగా ఫీలవుతాను. అమ్మనవ్వడం, అమ్మ అని పిలిపించుకోవడం ఎంత బాగుంటుందో.. అందుకోసం నేను ఎదురుచూస్తున్నాను' అని చెప్పుకొచ్చింది. కాగా శోభిత, నాగచైతన్య ప్రేమలో ఉన్నారంటూ తరచూ పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే! గతంలో ఈ రూమర్స్‌పై స్పందించిన శోభిత.. అసలేమీ తెలియకుండా ఏదో ఒకటి వాగేవాళ్లకు నేను సమాధానమివ్వాల్సిన పని లేదు. నేను ఏ తప్పూ చేయనప్పుడు దాని గురించి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు' అని చెప్పింది.
చదవండి: నయనతార కోసం ఇంటి చుట్టూ ప్రతిరోజూ ప్రదక్షిణలు చేసిన హీరో
Comments
Please login to add a commentAdd a comment