Adah Sharma Nunchaku Fight Moves, Video Goes Viral On Social Media | అందాల అదా మరో విన్యాసం.. - Sakshi
Sakshi News home page

అందాల అదా మరో విన్యాసం.. వీడియో వైరల్‌

Published Wed, Jan 27 2021 12:29 PM | Last Updated on Wed, Jan 27 2021 4:29 PM

Adah Sharma Nunchaku Video Goes Viral - Sakshi

పూరీ జగన్నాథ్ ‘హార్ట్‌ ఎటాక్‌’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచమైన హీరోయిన్‌ అదాశర్మ.  ఆ మూవీ తర్వాత ఈ అందాల భామకు టాలీవుడ్‌లో ఎక్కువ అవకాశాలు రాలేదు. దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్‌, వెబ్‌ సిరీస్‌లపై ఫోకస్‌ పెట్టింది. ఇక సినిమాల కంటే సోషల్‌ మీడియా ద్వారా ఎక్కువ మంది అభిమానులను సంపాంధించుకుంటుంది అందాల ముద్దుగుమ్మ అదా. నిత్యం కొత్త కొత్త స్టైల్లో రెడీ అయి ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు కిక్కెక్కిస్తోంది.

వింత వింత విన్యాసాలు చేస్తూ ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల సముద్రపు ఒడ్డున చీరకట్టులో పల్టీ జంప్స్ కొడుతూ దర్శనం ఇచ్చిన ఈ భామ.. తాజాగా నాంచాక్‌ తిప్పుతూ కనిపించింది. సముద్రతీరంలో వైట్ అండ్ వైట్ కరాటే డ్రెస్ ధరించి నాంచాక్ తిప్పింది. అత్యంత వేగంగా అదా ఆ ఫీట్ చేసింది. ఆ పోస్ట్ చూస్తూ నేటిజన్లు ఈ సొగసరి నాంచాక్ తిప్పడం కూడా అందంగానే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆదా డేర్ వీడియో వైరల్ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement