When Will Start Mahesh Babu And SS Rajamouli Upcoming Movie Shooting? - Sakshi
Sakshi News home page

రాజమౌళి-మహేష్‌ మూవీ స్టార్ట్‌ అయ్యేది అప్పుడేనా!

Published Mon, Feb 1 2021 5:27 PM | Last Updated on Mon, Feb 1 2021 7:19 PM

After Sarkaru Vaari Paata Is Mahesh Work With Rajamouli - Sakshi

టాలీవుడ్‌లో ఓటమంటూ ఎరగని దర్శకుడిగా పేరొందారు ఎస్‌ఎస్‌ రాజమౌళి. ఏ హీరోతో సినిమా చేసినా అందులో తనకంటూ ఓ ప్రత్యేకత చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక టాలీవుడ్‌ టాప్‌ హీరోల్లో ప్రిన్స్‌ మహేష్‌ బాబు ఒకరు. మహేష్‌ నుంచి సినిమా వస్తుందంటే ఆయన అభిమానులతో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా ఆసక్తి చూపుతుంది. అలాంటి వీరిద్దరి కాంబినేషనల్‌లో ఇప్పటి వరకు సినిమా రాలేదు. అయితే ఇటీవల రాజమౌళి.. మహేష్‌తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ పనుల్లో రాజమౌళి బిజీగా ఉన్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి కావడానికి వస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 13న విడుదల కానుంది. చదవండి: సంక్రాంతికి వస్తున్న 'సర్కారు వారి పాట'

మరోవైపు మహేష్‌ బాబు సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నట్లు పేర్కొంది. ఇప్పుడు ఈ రెండు సినిమాల రిలీజ్‌ డేట్‌లు రాజమౌళి, మహేష్‌ సినిమాపై ఓ క్లారిటీని ఇచ్చాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ అనంతరం అక్టోబర్‌లో రాజమౌళి, ఎస్‌వీపీ అనంతరం మహేష్‌ ఫ్రీ అవ్వడంతో 2022 ప్రారంభంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే మహేష్‌ కూడా తన ప్లాన్‌ మార్చుకున్నట్లు సమాచారం. సర్కారు వారి పాట అనంతరం ఏ ప్రాజెక్టుకు ఓకే చెప్పకుండా నేరుగా రాజమౌళి సినిమాను సెట్స్‌ మీదకు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా మహేష్‌తో చేయబోతున్న ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మిస్తారని ముందే ప్రకటించారు రాజమౌళి. అదేవిధంగా ఎప్పటిలాగే ఈ సినిమాకు సంబంధించిన కథను తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాస్తారని తెలిపారు. చదవండి: రాజమౌళి నిర్ణయంతో నిర్మాత బోనీ కపూర్‌ అప్‌సెట్‌!

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్‌ శివాజీ పాత్రలో నటిస్తాడని ఓ వార్త తాజాగా నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ.. ఈ వార్త విన్న మహేష్‌ అభిమానులు మాత్రం ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరో ఛత్రపతి శివాజీగా కనిపిస్తే ఎలా ఉంటాడో అని ఇప్పటి నుంచే ఊహించుకోవడం మొదలు పెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement