Aishwarya Rai, Trisha Gold Jewellery To Auction Which Wear In Ponniyin Selvan- 1 Movie - Sakshi
Sakshi News home page

Ponniyin Selvan: పొన్నియన్‌ సెల్వన్‌: అమ్మకానికి ఐశ్వర్య రాయ్‌, త్రిషల నగలు

Sep 28 2022 9:32 AM | Updated on Sep 28 2022 10:47 AM

Aishwarya Rai, Trisha Gold Jewellery to Auction Which Wear in Ponniyin Selvan - Sakshi

తమిళసినిమా: ప్రస్తుతం సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం పొన్నియిన్‌ సెల్వన్‌. ఇందుకు కారణాలు అనేకం. ప్రధాన కారణం చిత్ర కథ దివంగత ప్రఖ్యాత రచయిత కల్కి కలం నుంచి జారువాలిన నవల పొన్నియిన్‌ సెల్వన్‌. నాలుగు దశాబ్దాలకు పైగా ఈ నవల ప్రతులను అనేక మంది అనేకసార్లు ముద్రిస్తూనే ఉన్నారు. అంతగా తమిళ ప్రజల మనసుల్లో మమేకమై పోయింది ఈ నవల. మరో విశేషం ఏంటంటే దీనిని ఎంజీఆర్‌ నుంచి కమలహాసన్‌ వరకు చిత్రంగా మలచాలని ప్రయత్నించారు.

చదవండి: Indira Devi: మహేశ్‌ బాబు తల్లి మృతి.. చిరంజీవి సంతాపం

చివరికి దర్శకుడు మణిరత్నం దీన్ని తెరకెక్కించారు. విక్రమ్, కార్తీ, జయం రవి, విక్రమ్‌ ప్రభు, శరత్‌కుమార్, ప్రభు, పార్తీబన్, జయరాం, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్య, లక్ష్మి వంటి ముఖ్య తారలు నటించారు. ఏఆర్‌ రెహామాన్‌ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రం తొలిభాగం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో చిత్ర యూనిట్‌ ప్రస్తుతం ప్రచా ర కార్యక్రమాల్లో భాగంగా వివిధ రాష్ట్రాలను చుట్టేస్తోంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ముంబయికి చెందిన నటి ఐశ్వర్యారాయ్‌ కూడా ప్రతి ప్రచార కార్యక్రమంలోనూ పాల్గొంటున్నారు.

చదవండి: ఓటీటీ రిలీజ్‌కు సిద్దమైన ‘బింబిసార’.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌!

ఇంకా చెప్పాలంటే ఆమె యూనిట్‌కు సెంటర్‌ ఆఫ్‌ ది అట్రాక్షన్‌గా మారిపోయారు. అదే విధంగా ఇందులో నటించిన హీరోలు ఐశ్వర్యారాయ్‌తో ఫొటోలు దిగడం, అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతూ చిత్రంపై మరింత హైప్‌ను పెంచేస్తున్నాయి. కాగా మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది రాజుల నేపథ్యంలో రూపొందిన చిత్రం. ఇందులో నటి ఐశ్వర్యారాయ్‌ నందినిగానూ, త్రిష కుందవై రాణిగానూ నటించారు. ఆ పాత్రల కోసం వీరిద్దరూ ధరించిన ఆభరణాలను వేలం వేయడానికి చిత్ర యూనిట్‌ సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement