
‘రామ్ సేతు’ చిత్రబృందం ఊటీకి బై బై చెప్పేసింది. అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రల్లో తెలుగు నటుడు సత్యదేవ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రామ్ సేతు’. అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఊటీలో మొదలైన ఈ సినిమా షెడ్యూల్ ముగిసింది. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
జాక్వెలిన్, సత్యదేవ్‌తో పాటు తాను ఉన్న ఫొటోను షేర్ చేసి, ‘ఫోటోలో లేదా జీవితంలో చీకటి మేఘాలపై ఎప్పుడూ అందమైన కాంతిరేఖ ఉంటుంది’ అని పేర్కొన్నారు అక్షయ్ కుమార్. ఇందులో పురావస్తు శాస్త్రవేత్త పాత్రలో నటిస్తున్నారు అక్షయ్.
Comments
Please login to add a commentAdd a comment