ఫోన్‌ వాల్‌పేపర్‌ చూపిస్తూ బ్లష్‌ అయిన అలియా.. ఇంతకీ ఏముందంటే! | Alia Bhatt Blushes As She Reveals Her Mobile Wallpaper | Sakshi
Sakshi News home page

Alia Bhatt : ఫోన్‌ వాల్‌పేపర్‌ చూపిస్తూ బ్లష్‌ అయిన అలియా.. ఇంతకీ ఏముందంటే!

Published Sat, Nov 13 2021 4:33 PM | Last Updated on Sat, Nov 13 2021 5:53 PM

Alia Bhatt Blushes As She Reveals Her Mobile Wallpaper - Sakshi

బాలీవుడ్‌ క్యూటీ అలియా భట్‌ దీపావళి రోజున హీరో రణ్‌బీర్‌ కపూర్‌తో ఉన్న రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించింది. అతన్ని ఎంతగా ప్రేమిస్తుందో తెలియజేసింది. అలియా భట్‌ కేవలం హీరోయిన్‌ మాత్రమే కాదు ఒక యూట‍్యూబర్‌ కూడా. యూట్యూబ్‌లో ఆమెకు 1.6 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. ఆమె శనివారం తన తాజా వ్లాగ్‌ను షేర్‌ చేసింది. ఇందులో తన బెస్ట్‌ ఫ్రెండ్ ఆకాంక్ష రంజన్‌ కపూర్‌తో సంభాషణలో నిమగ్నమై కనిపించింది. ఈ సంభాషణలో మధ్యలో తన ఫోన్‌లోని వాల్‌పేపర్‌ చూపించింది. రణ్‌బీర్‌తో అలియా సన్నిహితంగా, ప్రేమగా ఉన్న సెల్ఫీ వాల్‌పేపర్‌గా ఉంది. ఇది చూపిస్తూ బాలీవుడ్‌ బ్యూటీ క్యూట్‌గా బ్లష్‌ అయింది. 

కాగా, రణ్‌బీర్‌, అలియాలు ఈ నెల ప్రారంభంలో వారి రిలేషన్‌ గురించి అధికారికంగా ప్రకటించి అభిమానులకు ఆశ్చర్యం కలిగించారు. కపూర్ ఫ్యామిలి ఫంక్షన్స్‌కి అలియా హాజరైన ప్రతిసారి వారిద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు గాసిప్స్‌ వచ్చాయి. అప్పుడు ఎవరూ ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. అయితే దీపావళి రోజున అలియా పెట్టిన పోస్ట్‌తో ఈ పుకార్లకు బ్రేక్‌ పడింది. దీపావళి సందర్భంగా అలియా తన ఇన్‌స్టా గ్రామ్‌లో కొన్ని ఫొటోస్‌ షేర్‌ చేసింది. అందులో మొదటి ఫొటోకు 'కొంత కాంతి.. హ్యాపీ దివాళి' అంటూ క్యాప‍్షన్‌ ఇచ్చింది.
చదవండి: కరణ్‌ జోహార్‌ ఇంటర్వ్యూ.. అలియా క్యూట్‌ క్యూట్‌ సమాధానాలు 

తర్వాతి ఫొటో మాత్రం ఆమె అభిమానులను ఆశ్చర్యపరిచింది. అందులో రణ్‌బీర్‌ను అలియా కౌగిలించుకుని, ఒకరినొకరు చూస్తు స్మైల్‌ చేస్తున్నట్టు ఉంది. ఆ ఫొటోలో వారిద్దరూ నీలి రంగు దుస్తులు ధరించారు. ఇంకా 'కొంత ప్రేమ.. హ్యాపీ దివాళి' అని క్యాప్షన్‌ పెట్టింది. ఇలా వారి రిలేషన్‌ బహిర్గతమైంది. అధికారికంగా తమ ప్రేమాయణం పెళ్లి పీటలు ఎక్కేందుకు ఎక్కువ సమయం పట్టదని అభిమానులు అనుకుంటున్నారు.

రణ్‌బీర్‌ కపూర్‌ త్వరలో లవ్‌ రంజన్‌, బ్రహ్మాస్త్ర, యానిమల్‌, షంషేరలో కనిపించనున్నాడు. బ్రహ్మాస్త్ర, రాకీ ఔర్‌ రాణీ కి ప్రేమ్‌ కహానీ, గంగూబాయి కతియావాడి, డార్లింగ్స్‌, ఆర్‌ఆర్‌ఆర్‌, తఖ్త్‌ చిత్రాల్లో నటిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement