పొలం గట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు
పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
కిర్రు సెప్పులేసుకుని కర్రసాము సేసినట్టు
మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు
ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు.......... తర్వాత వచ్చే పదాలు ఆల్‌రెడీ మీ నోళ్లలో నానుతూనే ఉన్నాయి. అంతలా జనాలకు ఎక్కేసిందీ సాంగ్. నాటు నాటు పాట అందరికీ తెగ నచ్చేసింది. అచ్చమైన యాసలో సాగే ఈ పాట భారతీయ ప్రేక్షకులకే కాదు, ఖండాంతరాలు దాటి ప్రపంచంలో ఉన్న అందరినీ కట్టిపడేసింది. ప్రపంచవ్యాప్తంగా నాటునాటు పాట మార్మోగిపోయింది. తాజాగా ఈ పాటకు ఆర్‌ఆర్‌ఆర్ బ్యూటీ ఆలియా భట్ చిందేసింది, అది కూడా చీరలో! అంతేకాదు, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆలియా ఇలా స్టేజీపై స్టెప్పులేయడం ఇదే మొదటిసారి కావడం మరో విశేషం!
ఆదివారం జరిగిన ఓ అవార్డుల కార్యక్రమానికి ఆలియా హాజరైంది. గంగూబాయి కఠియావాడి, డార్లింగ్స్‌కుగానూ ఆమెకు రెండు అవార్డులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంతోషంలో ఆలియా తన డ్యాన్స్‌తో అభిమానులను హుషారెత్తించింది. తను నటించిన హిట్ సినిమాల్లోని పాటలకు కాలు కదిపిందీ హీరోయిన్. ఈ క్రమంలో అక్కడున్న వ్యాఖ్యాతలు ఆయుష్మాన్ ఖురానా, అపరశక్తి ఖురానాతో కలిసి నాటు నాటు పాట హిందీ వర్షన్‌కు దుమ్ము దులిపేలా స్టెప్పులేసింది. ఓ అభిమాని ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా క్షణాల్లో అది వైరల్‌గా మారింది. ఆలియా గ్రేస్‌ను చూసిన ఫ్యాన్స్.. 'నాలుగు నెలల కిందటే పాపకు జన్మనిచ్చింది. అంతలోనే ఎంత జోరుగా డ్యాన్స్ చేస్తోందో, నీకు ఎవరూ సాటి లేరు..' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
this woman had a baby just 4 months ago and look at her ??? there is no one in comparison of alia bhatt truly the greatest pic.twitter.com/Sf8gICfvjc
— 𓅪 (@alfiyastic) February 26, 2023
Alia bhatt first performance as gangubai
— ā (@safeenafirdausi) February 26, 2023
Omg the swag 🥵🔥 pic.twitter.com/dSfdC2O5tE
Comments
Please login to add a commentAdd a comment