Alia Bhatt Grandfather Narendra Razdan Passes Away At 93 - Sakshi
Sakshi News home page

Alia Bhatt: ఆలియా భట్‌ ఇంట విషాదం.. మళ్లీ కలుద్దామంటూ హీరోయిన్‌ పోస్ట్‌

Jun 1 2023 2:18 PM | Updated on Jun 1 2023 3:25 PM

Narendra Razdan Passes Away  - Sakshi

నాకోసం రుచికరమైన ఆమ్లెట్‌ వేసిచ్చేవాడివి. నాకు బోలెడన్ని కథలు చెప్పేవాడివి.. వయోలిన్‌ వాయించేవాడివి. నీ ముని మనవరాలితో కూడా ఆటలాడుకున్నావు. నువ్వు క్రి

బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తాతయ్య నరేంద్ర రజ్దాన్‌(93) గురువారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వారం రోజులుగా ఆస్పత్రిలో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆలియా భట్‌ సోషల్‌ మీడియాలో వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనైంది.

'తాతయ్యా.. నువ్వే నా హీరో 93 ఏళ్ల వయసులో కూడా గోల్ఫ్‌ ఆడావు. మొన్నటివరకు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు. నాకోసం రుచికరమైన ఆమ్లెట్‌ వేసిచ్చేవాడివి. నాకు బోలెడన్ని కథలు చెప్పేవాడివి.. వయోలిన్‌ వాయించేవాడివి. నీ ముని మనవరాలితో కూడా ఆటలాడుకున్నావు. నువ్వు క్రికెట్‌ ఆడే విధానం అన్నా.. నీ స్కెచ్‌లన్నా ఎంతో ఇష్టం. నీ చివరి క్షణం వరకు నీ కుటుంబాన్ని ప్రేమించావు.

ఇప్పుడు నువ్వు లేవన్న బాధతో నా మనసంతా దుఃఖంతో నిండిపోయింది. అదే సమయంలో ఆనందంగానూ ఉంది. ఎందుకంటే మా తాతయ్య నాకు బోలెడంత సంతోషాన్ని అందించాడు. అందుకు చాలా గర్వంగా ఉంది. మనం మళ్లీ కలుసుకునేవరకు దాన్ని అలాగే భద్రంగా ఉంచుకుంటాను' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది. దీనికి ఇటీవలి కాలంలో జరిగిన నరేంద్ర బర్త్‌డే సెలబ్రేషన్స్‌ వీడియోను జత చేసింది ఆలియా భట్‌.

చదవండి: తమన్‌పై మళ్లీ కాపీ మరకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement